
మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారికకు గుంటూర్ ఐజి జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగింది. కొద్దిరోజుల క్రిదట తనకు కాబోయే భర్త గురించి చెప్పి సర్ ప్రైజ్ చేసిన నిహారిక ఆ తర్వాత అతనితో దిగిన పిక్స్ ను షేర్ చేసి అందరిని అలరించింది. గురువారం సాయంత్రం చైతన్య, నిహారికల ఎంగేజ్మెంట్ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది.
మెగా ఫ్యామిలీకి సంబందించిన కొంతమంది.. చైతన్య కుటుంబ సభ్యులు కొంతమంది మాత్రమే ఈ నిశ్చితార్ధ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం చైతన్య, నిహారిక ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, రాం చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహా, మెగాస్టార్ కూతుళ్ళు, మెగా అల్లుళ్లు, మేనల్లుళ్ళు ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.