సాయి ధరం తేజ్ మరో క్రేజీ మూవీ..!

మెగా మెనల్లుడు సాయి ధరం తేజ్ చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్న సాయి తేజ్ తన నెక్స్ట్ సినిమా దేవా కట్ట డైరక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా తర్వత మూవీని నూతన దర్శకుడితో ఫిక్స్ చేసుకున్నాడు సాయి ధరం తేజ్. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న కార్తిక్ డైరక్షన్ లో సాయి తేజ్ సినిమా ప్లాన్ చేశాడు.

ఈ సినిమాను సుకుమార్ నిర్మిస్తాడని తెలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథగా ఈ సినిమా రాబోతుందని అంటున్నారు. ఈ సినిమా గురించి చెబుతూ లోడింగ్ అనే కామెంట్ పెట్టి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు సాయి ధరం తేజ్. ఇక ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఆగష్టు 14న 12:06 గంటలకు రివీల్ చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి సాయి ధరం తేజ్ మళ్ళీ వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్నాడని తెలుస్తుంది.