
మళయాళ భామ కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస క్రేజీ సినిమాలు చేస్తూ వచ్చింది. మహానటి సినిమాతో అమ్మడు నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన కీర్తి సురేష్ ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఆమె నటించిన మిస్ ఇండియా దాదాపు పూర్తి కాగా.. మరో సినిమా గుడ్ లక్ సఖి సినిమా కూడా కొంత భాగం షూటింగ్ తో ముగుస్తుందట.
నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకులుగా ఉన్నారు. గుడ్ లక్ సఖి సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు సంబందించిన టీజర్ కూడా ఈ నెల 15న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారట. మొత్తానికి కీర్తి సురేష్ ఫ్యాన్స్ కు వరుస సినిమాలు అలరించనున్నాయి.