పవర్ స్టార్ లిస్ట్ లో మరో డైరక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా ఫిక్స్ చేసుకున్నారు. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఆ సినిమా కూడా భారీ ప్లాన్ తో వస్తున్నాడు పవన్. ఇక ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ తో కూడా సినిమా ఉందని అంటున్నారు. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కాబట్టి ఆ మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని అంటున్నారు. మెగా డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సురేందర్ రెడ్డి రేసు గుర్రం, ధృవ, సైరా నరసింహా రెడ్డి సినిమాలతో తన సత్తా చాటుకున్నాడు. ప్రభాస్, వరుణ్ తేజ్ లతో సినిమా ప్రయత్నించినా వర్క్ అవుట్ కాకపోయే సరికి పవర్ స్టార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట సురేందర్ రెడ్డి. ఇప్పటికే కథ పూర్తి కాగా పవన్ ను కలిసి వినిపించడమే లేట్ అని తెలుస్తుంది.