జాంబి రెడ్డి టైటిల్ పై స్పందించిన డైరక్టర్..!

అ! సినిమా తీసి ఆశ్చర్యపరచిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమా రాజశేఖర్ తో కల్కి తెరకెక్కించాడు.. సినిమా బాగానే ఉన్నా ఎందుకో ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. లేటెస్ట్ గా కరోనా వైరస్ మీద ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. జాంబి రెడ్డి టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. సినిమా టైటిల్, గాఫిక్స్ పై మిశ్రమ స్పందన వచ్చింది.   

ఈ సినిమా టైటిల్ లో ఒక కమ్యునిటీని పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఆ కమ్యునిటీ మనోభావాలు దెబ్బతినేలా టైటిల్ ఉందని సోషల్ మీడియాలో గొడవ మొదలైంది. అయితే ఈ చిత్రంపై వస్తున్న విమర్శలపై డైరక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించారు. సినిమా టైటిల్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని.. జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లో నిలిచిందని అన్నారు. అంతేకాదు టైటిల్ బాగుందంటూ చాలా కాల్స్, మెసేజులు వచ్చాయని. సినిమా కథకు అది యాప్ట్ టైటిల్. యానిమేషన్ కూడా బాగా వచ్చింది. టీం పడిన కష్టానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కొంతమందికి టైటిల్ నచ్చలేదు. సినిమాలో ఎవరిని తక్కువ చేసి చూపించలేదు. ప్రత్యేకించి ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించడం జరగలేదు. ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా.. కర్నూలు నేపథ్యంలో కరోనా మహమ్మారి మీద తెరకెక్కించిన సినిమా. ఈ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని అన్నారు ప్రశాంత్ వర్మ. మరి ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలు విని జాంబి రెడ్డి గురించి సైలెంట్ గా ఉంటారా. లేక టైటిల్ మార్చేదాకా హడావిడి చేస్తారా అన్నది చూడాలి.