బిగ్ బాస్ 4లో గోపీ ఎవరు..?

కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. సీజన్ 3 హోస్ట్ గా అలరించిన కింగ్ నాగార్జున సీజన్ 4కి హోస్ట్ గా చేస్తున్నారు. లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ఓల్డ్ గెటప్ లో నాగార్జున బయోస్కోప్ పెట్టుకుని గోపీ అంటున్నారు. ఇంతకీ నాగ్ గోపీ అన్నది ఎవరిని. ఈ సీజన్ లో ఏం జరగబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంది.

బిగ్ బాస్ సీజన్ 4లో ఎప్పటిలానే 15 మంది కంటెస్టంట్స్ ఉంటారని తెలుస్తుంది. అంతేకాదు 100 రోజులు పైనే షో నిర్వహిస్తారట. ఈసారి సరికొత్త టాస్కులు, ఆటలు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఎప్పటిలా గెస్ట్ అప్పియరెన్స్, ఫ్యామిలీ మెంబర్స్ హౌజ్ లోకి ఎంటర్ అవడం లాంటివి మాత్రం ఉండవని తెలుస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనగానే బుల్లితెర ఆడియెన్స్ లో ఓ ఎక్సయిట్ మెంట్ మొదలైంది.