మరో తెలుగు దర్శకుడికి కరోనా

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఇద్దరు నిర్మాతలు కరోనా బారిన పడి మృతి చెందగా దర్శకుడు రాజమౌళి, బండ్ల గణేష్ లాంటి వారు కరోనా నుండి సురక్షితంగా బయపడ్డారు. ప్రస్తుతం తేజ, బాల సుబ్రహ్మణ్యం, సింగర్ స్మిత లకు కరోనా వచ్చినట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ డైరక్టర్ అజయ్ భూపతికి కరోనా రిజల్ట్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. తనకు కరోనా వచ్చిన విషయాన్ని అజయ్ భూపతి స్వయంగా తన ట్విట్టర్ లో వెళ్ళడించారు. ఆయన సింపుల్ గా వచ్చేసింది అని మెసేజ్ పెట్టారు.   

అంతేకాదు తర్వాత త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా అంటూ కూడా ట్విట్టర్ లో మరో మెసేజ్ పెట్టారు. ఆరెక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమాతోనే తన ప్రతిభ చాటిన అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా శర్వానంద్ తో మహా సముద్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో బొమ్మరిల్లు సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది.