సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్.. చిరు స్పందన ఇది..!

బాలీవుడ్ హీరో కం విలన్ సంజయ్ దత్ కు కరోనా నెగటివ్ వచ్చిందని సంబరపడే లోగా అంతకన్నా పెద్ద వ్యాధి బయపడ్డది. సంజయ్ కు లంగ్ క్యాన్సర్ 3వ దశలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సంజయ్ దత్ కు క్యాన్సర్ అని తెలియగానే ఒక్కసారి బాలీవుడ్ అంతా షాక్ అయ్యింది. సిని ప్రముఖులంతా సంజయ్ త్వరగా దీని నుండి కోలుకోవాలని కోరుతున్నారు. సంజయ్ దత్ గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. 

డియర్ సంజయ్ దత్ భాయ్.. మీరు క్యాన్సర్ కు గురయ్యారనే వార్త తెలిసి బాధ కలిగింది. ఎన్నో సంవత్సరాలుగా సంక్షోభాలను ఎదుర్కుంటూ వాటిని అధిగమించారు. ఇప్పుడు కూడా మీ అనారోగ్య పరిస్థితి నుండి ఎగిరే రంగుల్లా బయటపడతారనడంలో సందేహం లేదు. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా అంటూ సంజయ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. భర్తకు క్యాన్సర్ వచ్చిదని తెలిసి సంజయ్ దత్ భర్య మాన్యతా దత్ కూడా మళ్ళీ దేవుడు పరీక్షించేందుకు మమ్మల్ని ఎంచుకున్నాడు. నా భర్త పోరాట యోధుడు తప్పకుండా విజయ సాధిస్తాడు అని అన్నారు.