
నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా V. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయినా అప్పటివరకు సినిమా రిలీజ్ ఆపాల్సిందే అని హీరో, డైరక్టర్ ఉంటే నిర్మాత దిల్ రాజు మాత్రం వారిని ఒప్పించి ఓటిటి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. దాదాపు నెలరోజుల పాటుగా కొనసగుతున్న ఈ చర్చలు ఫైనల్ గా ఫలించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ లో నాని అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు అమేజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తుంది. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన నాని 'V' సినిమాకు అమేజాన్ ప్రైమ్ బిగ్ డీల్ ఇవ్వగా ఫైనల్ గా డైరక్టర్, ప్రొడ్యూసర్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే నాని వి అమేజాన్ ప్రైమ్ రిలీజ్ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.