కరోనాని జయించిన రాజమౌళి

రెండువారాల క్రితం తనతో పాటుగా ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకిందని ప్రకటించిన రాజమౌళి అందరికి షాక్ ఇచ్చాడు. సింటమ్స్ లేకపోవడంతో హోమ్ క్వారెంటైన్ లో ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే తన రెండు వారాల హోమ్ క్వారెంటైన్ ను పూర్తి చేసుకున్న రాజమౌళి మరోసారి కరోనా టెస్ట్ చేసుకోగా నెగటివ్ వచ్చిందట. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ లో వెళ్లడించారు.    

ఇక ప్లాస్మా దానం మీద కూడా రాజమౌళి స్పందించారు. డాక్టర్ సలహా మేరకు 3 వారాల రెస్ట్ తర్వాత ప్లాస్మా డొనేట్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాజమౌళి కరోనాని జయించాడన్న విషయం తెలిసి చిత్ర పరిశ్రమతో పాటుగా అభిమానులు, సిని ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కరోనాని జయించిన స్టార్ డైరక్టర్ రాజమౌళి ఈ వైరస్ గురించి తన మాటల్లో ఏం చెబుతారో చూడాలి.