ఉమామహేశ్వరపై చరణ్ రివ్యూ..!

కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో ప్రతిభ చాటిన దర్శకుడు వెంకటేష్ మహా రెండో సినిమాగా ఓ మళయాళ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేశాడు. మళయాళంలో సూపర్ హిట్టైన మహేషింతే ప్రతికారం సినిమాను తెలుగులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చేశాడు. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నరేష్, సుహాస్, హరి చందన, రూప నటించారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. 

ఈ సినిమాకు సెలబ్రిటీస్ నుండి ప్రశంసలు అందుతున్నాయి. లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఉమామహేశ్వర సినిమా సూపర్ అనేస్తున్నాడు. సినిమా కంటెంట్.. యాక్టింగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయని తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నరు రాం చరణ్. రాం చరణ్ రివ్యూతో మరోసారి ఉమామహేశ్వర సినిమాపై ఫోకస్ పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ తన నటనతో మెప్పించాడు.