
తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా అమ్మకు కొడుకే.. అలానే మెగాస్టార్ చిరంజీవికి బయట ఎంత పెద్ద ఇమేజ్ ఉన్నా అంజన దేవి దగ్గర చిన్నవాడే. తల్లి మీద తనకున్న ప్రేమని చూపించడంలో ఎప్పుడు ముందుండే చిరంజీవి ఆదివారం స్పెషల్ గా అమ్మ కోసం చింతకాయ తొక్కుతో చేపల వేపుడు చేశారు. చేయడమే కాదు అది వీడియో తీసి తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న మెగాస్టార్ అమ్మకు ప్రేమలో చింతకాయ చేపల వేపుడు కర్రీ చేసి పెట్టాడు. చిరు చేసిన ఈ కర్రీ తిని అంజన దేవి సూపర్ అనేసింది. చిరు స్పెషల్ డిష్ ను చేయడమే కాదు అభిమానులకు చూపించి అలరించారు. తాను మెగాస్టార్ ను అయ్యుండి టైం దొరికినప్పుడల్లా ఇలా అమ్మకి ఇష్టమైన వంటకం చేస్తా.. మీరు చేయాలని ఈ వీడియోతో మెసేజ్ ఇస్తున్నారు చిరంజీవి.