సమంత, రష్మిక మల్టీస్టారర్..!

టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ సమంత, రష్మికలు కలిసి ఒకే సినిమాలో అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. పెళ్ళి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ కెరియర్ తో సమంత, వరుస స్టార్ సినిమాల్తో కన్నడ భామ రష్మిక ఇద్దరు మంచి జోష్ లో ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో సిస్టర్స్ గా చేస్తున్నారట.     

ఓ బడా నిర్మాణ సంస్థ స్టార్ హీరోతో చేసే ఈ సినిమాలో ఈ ఇద్దరు భామలు నటిస్తారని తెలుస్తుంది. స్టార్ హీరోతో పాటుగా ఈ సినిమాలో సెకండ్ హీరోగా మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని తెలుస్తుంది. ఆ హీరోలెవరన్నది తెలియదు కాని హీరోయిన్స్ గా సమంత, రష్మికలను మాత్రం ఫిక్స్ చేశారట.  

జాను తర్వాత సమంత ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. రష్మిక కూడా సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది.