
టైటిల్ చూసి డైరక్టర్ అనీల్ రావిపుడి మెగాస్టార్ చిరంజీవిని మెప్పించే కథని చెప్పాడని.. త్వర్లోనే అనీల్ డైరక్షన్ లోనే చిరు సినిమా వస్తుందని భావించి ఉంటారు. ఇక్కడ ప్రస్థావించేది డైరక్టర్ అనీల్ రావిపుడి కాదు నిర్మాత అనీల్ సుంకర గురించి. 14 రీల్స్ తో పాటు కొన్నాళ్లు కలిసి సినిమాలు చేసి ఆ తర్వాత ఏకే ఎటర్టైన్మెంట్స్ లో సినిమాలు చేస్తూ వస్తున్న అనీల్ సుంకర మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా చేశారు.. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో కూడా భాగస్వామ్యం అవుతున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత అనీల్ సుంకర మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ పై చిరు కన్ను పడ్డది. ఈ రీమేక్ ను అనీల్ సుంకర నిర్మాణంలో వస్తుందని తెలుస్తుంది. సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తారని టాక్. మొత్తానికి అనీల్ సుంకర నిర్మాతగా చిరు సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.