మహేష్ బాబుకి ఫ్యాన్స్ మరచిపోలేని బర్త్ డే గిఫ్ట్..!

ఆగష్టు 9 సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే రోజు మహేష్ బాబుకి మరచిపోలేని గిఫ్ట్ అందించారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. హ్యాపీ బర్త్ డే మహేష్ అనే బర్త్ డే ట్రెండ్ ను 24 గంటల్లో 60.2 మిలియన్ ట్వీట్స్ తో టాప్ ట్రెండింగ్ లో నిలబెట్టారు. అంతకుముందు పవన్, ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ట్విట్టర్ బర్త్ డే ట్రెండింగ్ లు అన్నిటి రికార్డులను బ్రేక్ చేసి హంగామా చేశారు మహేష్ ఫ్యాన్స్.


మహేష్ బర్త్ డే నాడు 6 కోట్లకు పైగా ట్వీట్స్ హ్యాపీ బర్త్ డే మహేష్ ట్వీట్ ట్రెండింగ్ తో మహేష్ కు మరచిపోలేని కానుక ఇచ్చారు. మహేష్ మాత్రం పుట్టినరోజు నాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను కొనసాగిస్తూ పెరట్లో మొక్క వేశాడు. ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట నుండి మహేష్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.