
మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి సినిమాలో విలన్ గా చేస్తున్నారు. సాంగ్స్, ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. ఈ మూవీ రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ ఛాన్స్ అందుకున్నాడు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా మేనల్లుడి సెకండ్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ ఫైనల్ కాగా త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ఉప్పెన సినిమా రిలీజ్ కు రెడీ కాగా ఓటిటి ఆఫర్స్ వస్తున్నా సరే థియేటర్లు ఓపెన్ అయ్యాక సిల్వర్ స్క్రీన్ పైనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని అంటున్నారు మేకర్స్.