
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ ప్రస్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుచూరి వెంకటేశ్వర రావు, గోపాల కృష్ణ ఇద్దరు అన్నదమ్ములు కలం పట్టారంటే సినిమా సూపర్ హిట్ అన్నట్టే. పరుచూరి వెంకటేశ్వర రావు సతీమణి విజయలక్ష్మి (74) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతోబాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు.
పరుచూరి విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. రైటర్, డైరక్టర్, యాక్టర్ గా పరుచూరి వెంకటేశ్వర రావు ఎన్నో సినిమాలు చేశారు. ఈమధ్య పరుచూరి వెంకటేశ్వర రావు సోదరుడు గోపాల కృష్ణ పరుచూరి పలుకులు అంటూ రిలీజైన సినిమాల గురించి తన వర్షన్ చెబుతున్నారు. అయితే గోపాల కృష్ణ కనిపించనంతగా వెంకటేశ్వర రావు బయటకు కనిపించడం లేదు.