నష్టపరిహారం అందించారు..!

ఇండియన్ 2 క్రేన్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన చిత్రయూనిట్ సభ్యుల కుటుంబాలకు నష్టపరిహారం అందించారు కమల్ హాసన్. ఫిబ్రవరి 19న షూటింగ్ కు సిద్ధం చేస్తున్న క్రేన్ ఒక్కసారిగా విరిగి పడటంతో చిత్రయూనిట్ కు సంబందించిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. డైరక్టర్ శంకర్ కూడా కొద్దిపాటి గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన ఇండియన్ సినీ పరిశ్రమనే షాకింగ్ కు గురి చేసింది.       

కమల్ హసన్, శంకర్ ఒక్కో కోటి.. లైకా ప్రొడక్షన్ 2 కోట్లు మొత్తం నాలుగు కోట్ల రూపాయలు ముగ్గురు బాధిత కుటుంబాలకు అందించారు. ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్త పడాలని కమల్ హాసన్ అన్నారు. ఇకపై తను తీసే సినిమాల్లో ఇలాంటివి జరుగకుండా చూసుకుంటానని దర్శకుడు శంకర్ భావోద్వేగానికి లోనయ్యారు.