చిరుతో మెహర్ రమేష్.. ఆ సినిమా రీమేక్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత చిరు ముగ్గురు దర్శకులతో సినిమాలు కన్ఫాం చేశారు. అందులో మెహెర్ రమేష్, కె.ఎస్ రవింద్ర, సుజిత్ ఉన్నారు. మెహెర్ రమేష్ తో తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారని టాక్.  

కోలీవుడ్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాను చిరు రీమేక్ చేస్తారని తెలుస్తుంది. ఈ రీమేక్ బాధ్యతను మెహర్ రమేష్ కు అప్పగిస్తున్నారట. తమిళంలో వేదాళం మంచి హిట్ కాగా తెలుగులో చిరు రీమేక్ చేస్తే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. ఆచార్య తర్వాత చిరు ఏ సినిమా చేస్తాడు అన్న విషయంపై ఈ నెల 22న ఎనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది.