
అక్కినేని నట వారసుడిగా మొదటి సినిమా తన పేరునే టైటిల్ గా పెట్టుకున్న అఖిల్ కెరియర్ లో మూడు సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న అఖిల్ తన నెక్స్ట్ సినిమా సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడితో చేస్తాడని అంటున్నారు.
పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి ఎఫ్-3తో పాటుగా బాలకృష్ణతో రామారావు సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. అయితే అఖిల్ మాత్రం అనీల్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. కమర్షియల్ అంశాలతో పాటుగా కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో వరుస హిట్లు కొడుతున్న అనీల్ రావిపుడి ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉన్నాడని చెప్పొచ్చు. మరి అఖిల్ ఐదవ సినిమా అనీల్ తోనే ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.