నితిన్ సినిమాలో నయనతార..?

యువ హీరో నితిన్ ఈ ఇయర్ భీష్మ సక్సెస్ తో సూపర్ జోష్ తో ఉన్నాడు. ఈమధ్యనే తను ప్రేమించిన షాలినిని కూడా పెళ్ళాడిన నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు నితిన్. మేర్లపాక గాంధి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా చేసిన ఈ సినిమాను తెలుగులో నితిన్ చేస్తున్నాడు.

అందాదున్ సినిమాలో టబు స్పెషల్ రోల్ చేశారు. తెలుగులో ఆ పాత్రలో టబునే తీసుకోవాలని అనుకోగా ఆమె భారీ రెమ్యునరేషన్ అడిగిందని లైట్ తీసుకున్నారు. అనసూయని ట్రై చేయగా ఆమె ఆ పాత్ర చేయనన్నదట. ఇక అందుకే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారని ఈ పాత్రకు సెలెక్ట్ చేయాలని అనుకున్నారు. నయనతారతో చర్చలు జరుపగా ఆ రోల్ చేస్తానని చెప్పిందట కాని 4 కోట్లు ఇస్తే చేస్తా అన్నదట. ప్రస్తుతం నయన్ తో చర్చల్లో ఉన్నారు తెలుగు అందాదున్ టీం.