
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అసలైతే మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ చేయాలని అనుకున్నాడు కాని సుజిత్ రీమేక్ కథతో మెప్పించకపోవడంతో డైరక్టర్ ను మార్చే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇదిలాఉంటే మరో దర్శకుడు మెహెర్ రమేష్ కూడా చిరు ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోలేదని తెలుస్తుంది. ఈమధ్యనే చిరుని కలిసి ఓ లైన్ చెప్పగా అది మెగాస్టార్ కు నచ్చలేదని తెలుస్తుంది.
ఇక కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరక్షన్ లో కూడా చిరంజీవి సినిమా ఉంటుందని టాక్. ఈమధ్యనే చిరుని కలిసి స్టోరీ లైన్ చెప్పాడట బాబి.. డైరక్టర్ బాబి చెప్పిన కథను చిరు సూపర్ అనేశాడట. ఇక ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా ఉంటాడని టాక్. బాబి కేవలం చిరు సినిమానే కాదు మెగా మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబందించిన న్యూస్ ఈ నెల 22న చిరు బర్త్ డే నాడు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తాడని తెలుస్తుంది.