
రాజమౌళి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తో పాటుగా అలియా భట్, ఒలివియా మోరిస్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్.. కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. సినిమాలో అల్లూరి ఎలా ఉంటాడు అన్నది ఫస్ట్ లుక్ టీజర్ లో తెలిసింది. ఇక చూడాల్సింది కొమరం భీమ్ లుక్కే. సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ పాత్రలో దాదాపు ఆరు గెటప్పులలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు పోటాపోటీగా ఈ సినిమాలో నటిస్తున్నారట. ఇద్దరు తమ నట విశ్వరూపం చూపిస్తారని అంటున్నారు. 2021 జనవరి 8 రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త వాయిదా పడనుంది. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు.