అఖిల్ సినిమా అక్కడ సూపర్ హిట్

అక్కినేని ఫ్యామిలీ నుండి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూడు సినిమాలు తీసినా ఒక్కటి కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా పూజా హెగ్దే నటిస్తుంది. అయితే అఖిల్ సినిమాలు తెలుగులో సక్సెస్ అవలేదు కాని హిందీలో మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి.

అఖిల్ వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో అంచనాలను అందుకోలేని ఈ సినిమా హిందీలో హిట్ అవడం విశేషం. తెలుగు ఫ్లాప్ సినిమాలు హిందీ లో హిట్టైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అల్లు అర్జున్ సినిమాలైతే హిందీ డబ్బింగ్ వర్షన్స్ రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నాయి. అఖిల్ మిస్టర్ మజ్ను సినిమా కూడా హిందీ డబ్బింగ్ వర్షన్ 100 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.