ఎన్.టి.ఆర్ కోసం జాన్వి..?

R.R.R సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రంతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండగా రష్మికతో పాటుగా శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.   

సౌత్ లో శ్రీదేవి క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తల్లి వారసత్వాన్ని ఇక్కడ కూడా కొనసాగించాలని అనుకుంటుంది జాన్వి కపూర్. ఇప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న అమ్మడు తెలుగులో ఎన్.టి.ఆర్ సరసన లక్కీ ఛాన్స్ అందుకుందని టాక్. తారక్ జోడీగా జాన్వి ఈ కాంబోపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. ఇక ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ పూర్తి కాగానే ఈ రెండు సినిమాలను ఒకేసారి చేస్తాడని తెలుస్తుంది.