
రాజా ది గ్రేట్ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ హిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడ్. ఈ ఇయర్ వచ్చిన డిస్కో రాజా రిలీజ్ కు ముందు బజ్ బాగున్నా ఆఫ్టర్ రిలీజ్ అది కూడా నిరాశపరచింది. ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నాడు రవితేజ. ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఒక సినిమా.. నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో మరో సినిమా లైన్ లో పెట్టాడు రవితేజ.
రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుండగా త్రినాథ రావు సినిమా మాత్రం మెగాస్టార్ చిరజీవి చంటబ్బాయి రీమేక్ గా వస్తున్నట్టు తెలుస్తుంది. స్టోరీ లైన్, కొన్ని పాత్రలను తీసుకుని ఆ సినిమానే త్రినాథ రావు మార్క్ తో తెరకెక్కిస్తున్నారత. చిరు పాత్రలో రవితేజ అంటే ఈ మూవీపై సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. చిరు కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకునే చంటబ్బాయి రీమేక్ లో రవితేజ ఎలా మెప్పిస్తాడో చూడాలి.