
టాలెంట్ ఉన్నా సరే లక్ కలిసి రాని డైరక్టర్స్ లో హను రాఘవపుడి ఒకరు. అందాల రాక్షసి సినిమా నుండి పడి పడి లేచే మనసు వరకు ఫీల్ గుడ్ మూవీస్ చేస్తున్న సరైన సక్సెస్ అందుకోవడంలో వెనకపడుతున్నాడు హను. ఇక లేటెస్ట్ గా హను మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ చేస్తూ ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా యుద్ధంతో ప్రేమ కథ అని పెట్టారు.
నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తర్వాత నానితోనే మరో సినిమా చేయాలని అనుకున్నాడు హను రాఘవపూడి. నానితో చేయాలనుకున్న ఆ కథనే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయింది. మహానటి తర్వాత ప్రియాంకా, స్వప్నా దత్ లు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది.