రాజమౌళికి కరోనా పాజిటివ్..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్ అని ప్రకటించారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న తనకు వేరే సిమ్ టమ్స్ లేకపోయినా కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందట. దీనితో తన ఫ్యామిలీ మొత్తం హోమ్ క్వారెంటైన్ లో ఉంటున్నారని ట్విట్టర్ ద్వారా వెళ్లడించారు రాజమౌళి.           

రాజమౌళికి కరోనా పాజిటివ్ అని తేలగానే ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది. రాజమౌళి ట్వీట్ కు రిప్లై గా మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాని తన్నమనండి అంటూ ట్వీట్ చేశాడు. చివరగా మీరు మీ కుటుంబం త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు ఆర్జీవి.