
సూపర్ స్టార్ మహేష్ తో స్పైడర్ ఫ్లాప్ అవడం.. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో చేసిన మన్మథుడు 2 కూడా నిరాశపరచడంతో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో వెనకపడ్డది. వరుస స్టార్ ఛాన్సులతో దూసుకెళ్లిన అమ్మడు ఒక్కసారిగా కెరియర్ సందిగ్ధంలో పడేసుకుంది. టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు చేస్తున్న అమ్మడు అక్కడ కూడా అరకొర అవకాశాలతో కెరియర్ వెళ్లదీస్తుంది. ప్రస్తుతం తెలుగులో నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబో మూవీలో నటిస్తున్న అమ్మడు లేటెస్ట్ గా ఓ వెబ్ సీరీస్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
డైరక్టర్ క్రిష్ నిమాతగా చేస్తున్న వెబ్ సీరీస్ లో రకుల్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుందట. ఈ వెబ్ సీరీస్ ఫీమేల్ సెంట్రిక్ గా ఉంటుందని తెలుస్తుంది. అందుకే లీడ్ రోల్ గా చేసేందుకు ఒప్పుకుంది అమ్మడు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా, సాయి పల్లవి లాంటి స్టార్స్ కూడా వెబ్ సీరీస్ లకు ఓకే చెబుతున్నారు. వారి దారిలోనే రకుల్ కూడా వెబ్ సీరీస్ కు సైన్ చేసిందట. ఓ పక్క సినిమాలు డైరెక్ట్ చేస్తూ నిర్మాతగా క్రిష్ వెబ్ సీరీస్ లు చేస్తూ భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.