18 పేజెస్ లో లావణ్యకు ఛాన్స్..!

లాస్ట్ ఇయర్ అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. ఎన్నో వాయిదాల తర్వాత రిలీజైన ఆ సినిమాలో కంటెంట్ ఉండటం వల్ల సినిమా ఒడ్డున పడ్డది. ఇక ఆ సినిమా తర్వాత కార్తికేయ సీక్వల్ గా కార్తికేయ 2 స్టార్ట్ చేసిన నిఖిల్, సుకుమార్ నిర్మాతగా 18 పేజెస్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను కుమారి 21f డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా ముందు రొమాంటిక్ హీరోయిన్ కెతిక శర్మని ఫిక్స్ చేయగా ఆమె ఎందుకో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట.

అందుకే ఆమె ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. నిఖిల్, లావణ్య ఇప్పటికే అర్జున్ సురవరం సినిమాలో కలిసి నటించారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి చేస్తే ఇది రెండో సినిమా అవుతుంది. 18 పేజెస్ టైటిల్ తో ఓ క్రేజీ లవ్ స్టోరీని చెప్పబోతున్నాడట సూర్య ప్రతాప్. ఈ సినిమా కూడా కుమార్ 21f రేంజ్ లో హిట్ అవుతుందని అంటున్నారు.