బ్యాచ్ లర్ రొమాంటిక్ టచ్..!

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ఒకటి లేటెస్ట్ గా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే తన కాలితో అఖిల్ చెవిని టచ్ చేస్తున్నట్టుగా ఓ పోస్టర్ వదిలారు. చూస్తుంటే బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో తన గ్లామర్ షోతో ఆకట్టుకునేలా ఉంది.

ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన పూజా హెగ్దే ఎప్పుడైతే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాలో బికిని షో చేసిందో అప్పటి నుండి అమ్మడికి క్రేజ్ పెరిగింది. డిజే తర్వాతనే వరుస స్టార్ ఛాన్సులు వచ్చాయి. ఈ ఇయర్ అల వైకుంఠపురములో సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్దే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం తో పాటుగా అఖిల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తుంది. సినిమాలో పూజా హెగ్దే అందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. ఈ సినిమా పోస్టర్ తో 2021 సంక్రాంతికి రిలీజ్ అని ఎనౌన్స్ చేయడం విశేషం.