
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మరో భారీ మూవీ RRR. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి నటించడం సినిమాపై తారాస్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తారక్, రాం చరణ్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ ఘట్టాలు మాత్రమే కాదు సెంటిమెంట్ కూడా అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తుంది.
RRR లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఇద్దరిది చాలా పవర్ ఫుల్ రోల్. అయితే సినిమాలో భారీ సన్నివేశాలు ఎలా ఉంటాయో అంతకుమించిన సెంటిమెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి సినిమాలో సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సెంటిమెంట్ సీన్స్ కూడా ట్రిపుల్ ఆర్ లో పుష్కలంగా ఉంటాయట. భీమ్, రామ రాజు పాత్రల మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు. 2021 జనవరి 8 రిలీజ్ అని చెప్పినా ఆ డేట్ కు సినిమా రిలీజ్ కష్టమని తెలుస్తుంది. సినిమా ఇప్పటివరకు 70 శాతం వరకు షూటింగ్ పూర్తి కాగా మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడన్నది మాత్రం తెలియాల్సి ఉంది.