
లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను ప్రియాంకా దత్ నిర్మిస్తున్నారని టాక్. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి డైరెక్ట్ చేసే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ బాగా వచ్చిందట.
డైరక్టర్ నందిని రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. నందిని రెడ్డి సినిమా కూడా ప్రేమకథగా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మ్యాక్సిమం సమంతతోనే తీసుకోవాలని చూస్తున్నారట. పెళ్ళి తర్వాత సెలెక్టెడ్ కథలను ఎంపిక చేసుకుంటున్న సమంత నాగ చైతన్య సినిమా అంటే మాత్రం తప్పకుండా చేస్తా అంటుంది. మజిలీ తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిసి చేసే ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడుతుంది.