BB3లో కళ్యాణ్ రామ్..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమా టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బిబి3 అంటూ వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ఈ సినిమా నుండి ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ నందమూరి ఫ్యాన్స్ ను ఎక్సయిట్ చేస్తుంది. బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమాలో మరో యువ హీరో నటించే ఛాన్స్ ఉందట. కళ్యాణ్ రామ్, బెల్లంకొండ శ్రీనివాస్, నాగ శౌర్య ఈ ముగ్గురిలో ఒకరు ఈ సినిమాలో నటిస్తారని అంటున్నారు.          

బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. అందుకే బోయపాటి మ్యాక్సిమం కళ్యాణ్ రాం ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట. BB3లో కళ్యాణ్ రామ్ నటించడం జరిగితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. సినిమాలో అంజలి, స్నేహ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.