మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న సుజిత్

రన్ రాజా రన్ సినిమా తర్వాత ఏకంగా బాహుబలి ప్రభాస్ నే డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు సుజిత్. సాహో కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా డైరక్టర్ గా సుజిత్ టాలెంట్ ప్రూవ్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని అన్నారు. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ బాధ్యతలను సుజిత్ మీద ఉంచారు. కాని చిరు ఫైనల్ స్క్రిప్ట్ చిరుని మెప్పించకపోవడంతో చిరు ఈ రీమేక్ ను వినాయక్ చేతుల్లో పెట్టాలని అనుకుంటున్నారట.  

చిరు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అవడంతో సుజిత్ డైలమాలో పడ్డాడు. అయితే లేటెస్ట్ గా సుజిత్ తో యువి క్రియేషన్స్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సుజిత్ రాసిన ఓ మల్టీస్టారర్ కథ నచ్చడంతో అతని 3వ సినిమా కూడా యువి క్రియేషన్స్ వారే నిర్మించాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తారని టాక్. మరి సాహో డైరక్టర్ చేయబోయే ఈ మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో చూడాలి.