ఈ టైమ్ లో రేటు పెంచిందా..?

అసలే కరోనా క్రైసిస్ వల్ల సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో నిర్మాతలు భారీ నష్టాలనే భరించాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో హీరోలు, హీరోయిన్స్ తమ రెమ్యునరేషన్ కూడా తగ్గిచుకోవాలని చూస్తున్నారు. అయితే ఇలాంటి టైం లో రెమ్యునరేషన్ ను పెంచి అందరికి షాక్ ఇస్తుంది పూజా హెగ్దే. డిజే ముందు వరకు ఆమె ఐరన్ లెగ్ హీరోయిన్ అనిపించుకోగా ఆ తర్వాత మాత్రం దశ తిరిగింది. వరుసగా స్టార్స్ తో నటిస్తున్న అమ్మడు సినిమాకు కోటి నుండి కోటిన్నర వరకు తీసుకుంటుంది.  

సాక్ష్యం సినిమాకు 1.50 కోట్లు వసూళు చేసిన పూజా హెగ్దే అల వైకుంఠపురములో సినిమాకు 1.20 కోట్లు తీసుకుందట. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ ఆఫర్ ముందే రావడంతో ఆ సినిమాకు కోటి మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకుందట పూజా హెగ్దే. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాకు కూడా 1.35 కోట్లు డిమాండ్ చేసిన పూజా హెగ్దే లేటెస్ట్ గా స్టార్ సినిమాకు ఆమెను అడిగితే 2 కోట్లు ఇస్తేనే కాని సినిమా చేయనని చెప్పిందట. ఇలాంటి టైంలో కూడా రెమ్యునరేషన్ పెంచింది అంటూ పూజా హెగ్దే మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి వీటిపై అమ్మడు ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.