కరోనాను జయించిన ఐశ్వర్య, ఆరాధ్య

బిగ్ బీ అమితాబ్ కుటుంబం కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమితాబ్ భార్య జయా బచ్చన్ కాకుండా అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా రాయ్ కూతురు ఆరాధ్య లకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ముంబైలోని నానావతి హాస్పిటల్ లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు.   

ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు మొదట్లో లక్షణాలు కనిపించకపోయినా తర్వాత  సిమ్టమ్స్ తెలియడంతో జూలై 17న వారిద్దరిని కూడా నానావతి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇన్నిరోజుల ట్రీట్ మెంట్ తర్వాత ఐశ్వర్య, ఆరాధ్యలకు ప్రస్తుతం కరోనా నెగటివ్ వచ్చిందని తెలుస్తుంది. కోవిడ్ 19 నెగటివ్ గా నిర్ధారించిన తర్వాతనే వారిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు అభిషేక్ బచ్చన్. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా వెళ్లడించారు.