నాగ శౌర్య ఫస్ట్ లుక్ అదిరింది

యువ హీరో నాగ శౌర్య తన 20వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చి ప్రేక్షకులను సర్ ప్రైస్ చేసాడు. కండలు తిరిగిన దేహంతో నాగ శౌర్య లుక్ అదిరిపోయింది. సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాను నారాయణ దాస్, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ లో నాగ శౌర్య విలుకాడుగా కనిపించి అలరించాడు. 

మాస్ ఇమేజ్ కోసం కొన్నాళ్ళుగా ట్రై చేస్తున్న నాగ శౌర్య ఈ కొత్త సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో షాక్ ఇచ్చాడు. ఈ సినిమాకు పార్ధు టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇయర్ వచ్చిన అశ్వద్ధామ సినిమా నిరాశపరచగా రాబోయే ఈ సినిమా అయినా సరే యువ హీరో ఖాతాలో హిట్ జోష్ తెస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటుగా మరో స్టోరీని ఫైనల్ చేసిన నాగ శౌర్య త్వరలోనే ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా చేస్తారని తెలుస్తుంది. నాగ శౌర్య 20వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో రొమాంటిక్ హీరోయిన్ కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.