
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె నటిస్తుంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మూడు సినిమాలు చేసినా కెరియర్ లో ఒక్క హిట్టు లేని అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న ఇలాంటి టైం లో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి అందుకే కొన్ని సినిమాలు ఈమధ్య ఓటిటి రిలీజ్ కు ఓకే చెప్పారు. ఈ క్రమంలోనే అఖిల్ బ్యాచ్ లర్ సినిమాను కూడా ఓటిటిలో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కింగ్ నాగార్జున ఫైర్ అవుతున్నారు. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాతనే అఖిల్ సినిమా రిలీజ్ ఉంటుంది కాని ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచన లేదని అంటున్నారట.