శుభమా అని పెళ్ళి చేసుకుంటుంటే.. బతుకు బస్టాండే అని..!

నితిన్, షాలినిల పెళ్ళి వేడుక సందర్భంగా నితిన్ లేటెస్ట్ గా నటిస్తున్న రంగ్ దే సినిమా నుండి సర్ ప్రైజ్ టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రంగ్ దే సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు చిత్రయూనిట్. నితిన్ కు పెళ్ళి శుభాకాంక్షలు చెబుతూ ఈ టీజర్ రిలీజ్ చేశారు. అయితే శుభమా అని పెళ్ళి చేసుకుంటుంటే.. సినిమా టీజర్ లో బస్టాండే బస్టాండే ఇక బతుకు బస్టాండే అని పాట వస్తుంది. టీజర్ సినిమాదే అయినా సిచువేషన్ కు బాగా మ్యాచ్ అయ్యింది.

ఇక సినిమా విషయానికి వస్తే వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ ఇయర్ మొదట్లో భీష్మతో సక్సెస్ అందుకున్న నితిన్ రంగ్ దే సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. నితిన్, కీర్తి సురేష్ ల జంట చాలా బాగుంది.