
పలాస 1978 సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన కరుణ కుమార్ ఆ సినిమాతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ను మెప్పించాడు. అందుకే ఈ డైరక్టర్ నెక్స్ట్ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే రాబోతుందని తెలుస్తుంది. సినిమా కన్నా ముందు డైరక్టర్ కరుణ కుమార్ ను వెబ్ సీరీస్ కు వాడేస్తున్నారు అల్లు అరవింద్. ఆహా కోసం కరుణ కుమార్ చేస్తున్న వెబ్ సీరీస్ మెట్రో స్టొరీస్. టైటిల్ తోనే కథ ఏంటో చెప్పేశాడు ఈ డైరక్టర్. ఇక ఈ సినిమాలో హీరోగా బిగ్ బాస్ 3 క్రేజీ కంటెస్టంట్ ఆలి రెజాని సెలెక్ట్ చేశారట.
బిగ్ బాస్ సీజన్ 3లో స్టార్ కంటెస్టంట్ గా మెప్పించిన ఆలి రెజా మధ్యలో ఎలిమినేట్ అయ్యి ఆడియెన్స్ ఓట్ తో మళ్ళ్లీ హౌజ్ లోకి వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 3లో ఆకట్టుకున్న ఆలి రెజాకు వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఆల్రెడీ కృష్ణవంశీ డైరక్షన్ లో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో అలి రెజా ఛాన్స్ అందుకున్నాడు. ఆ సినిమాతో పాటుగా కరుణ కుమార్ వెబ్ సీరీస్ మెట్రో స్టోరీస్ లో కూడా హీరోగా నటిస్తున్నాడట. విన్నర్ అయిన రాహుల్ సైలెంట్ గా ఉంటే మధ్యలో ఎలిమినేట్ అయిన ఆలి మాత్రం మంచి ఛాన్సులు అందుకుంటున్నాడు.