పద్మావతి 'అరుంధతి'గా మారితే..!

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనె ఖాతాలో క్రేజీ సినిమాలు పడుతున్నాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస స్టార్స్ తో నటిస్తున్న ఈ అమ్మడు ప్రభాస్ 21 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం భారీ మొత్తం ఇచ్చి మరి దీపికాను తీసుకున్నారు. ఇక ఇదే కాకుండా లేటెస్ట్ గా బాలీవుడ్ అరుంధతి కోసం కూడా దీపికాని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. కోడి రామకృష్ణ డైరక్షన్ లో అనుష్క లీడ్ రోల్ లో వచ్చిన సినిమా అరుంధతి. స్టార్ హీరో సినిమా వసూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా సంచలన విజయం అందుకుంది.  

ఇక ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ ను 11 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా సెట్స్ మీదకు వెళ్లలేదు. లేటెస్ట్ గా అరుంధతి నిర్మాత శ్యామ్ ప్రసాద్ దగ్గర నుండి హింది రీమేక్ రైట్స్ ను అల్లు అరవింద్ కొనేశారట. దీపికా పదుకొనెని అరుంధతిగా తీసుకోవాలని చూస్తున్నారట. దీపికా కాదని అంటే కంగనా రనౌత్ తో ఈ రీమేక్ చేస్తారని తెలుస్తుంది.