ఆహాలో 'రుద్రవీణ'.. సినిమా కాదండోయ్

అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు పోటీగా తెలుగులో అహా ఓటిటి మొదలుపెట్టాడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. మై హోం రామేశ్వర రావుతో భాగస్వామ్యంతో మొదలుపెట్టిన ఆహా అదరగొట్టేస్తుంది. వెబ్ సీరీస్, సినిమాలతో ఆహా ప్రేక్షకులతో నిజంగానే ఆహా అనిపిస్తుంది. ఈ లాక్ డౌన్ టైంలో ఆహా మరింత క్రేజ్ తెచ్చుకుంది.  

ఇక ఆహాలో కొత్తగా ఓ వెబ్ సీరీస్ లను ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటి లేడీ ఓరియెంటెడ్ గా వస్తుందట. ఆ వెబ్ సీరీస్ కు రుద్రవీణ అని టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. చిరంజీవి క్లాసిక్ మూవీ రుద్రవీణ. బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవితో పాటుగా జెమిని గణేషన్ కూడా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా టైటిల్ తో వస్తున్న వెబ్ సీరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి.