
టాలీవుడ్ చందమామ కాజల్ ఇప్పటికి వరుస అవకాశాలతో సూపర్ ఫాంలో ఉంది. సీనియర్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ సత్తా చాటుతున్న అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో కూడా డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో చిరు సరసన ఆచార్య సినిమాలో నటిస్తున్న కాజల్ తమిళంలో ఒక సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ చేసేందుకు కూడా ఓకే చెప్పిందట కాజల్ అగర్వాల్. బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా చేసిన క్వాంటికో వెబ్ సీరీస్ ఇక్కడకు రీమేక్ చేస్తున్నారట.
ప్రియాంకాకు హాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున ఆ వెబ్ సీరీస్ ను ఇప్పుడు తెలుగు, తమిళ, హింది భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో కాజల్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఆ వెబ్ సీరీస్ లో ప్రియాంకా లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయింది. మరి కాజల్ కూడా అదే విధంగా చేస్తుందా లేక ఆ సీన్స్ కత్తెరవేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. కాజల్ క్వాంటికో సీరీస్ లో నటిస్తుందని న్యూస్ రాగానే ఆమె ఫ్యాన్స్ మాత్రం సంబరపడుతున్నారు.