మూడవ ప్రపంచ యుద్ధం చూపించబోతున్న ప్రభాస్..!

సాహో తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా వస్తుందని వార్తలు రాగా లేటెస్ట్ గా ఈ సినిమా కథ థర్డ్ వరల్డ్ వార్ నేపథ్యంతో ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కుతుందని తెలుస్తుంది.     

వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనెని సెలెక్ట్ చేశారు. 2021 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి 2022లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కించి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు ప్రభాస్. మహానటి సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన నాగ్ అశ్విన్ ఈ సినిమాతో మరో సంచలనానికి సిద్ధమయ్యాడని తెలుస్తుంది.