
వి.వి.వినాయక్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా 2013లో వచ్చిన సినిమా నాయక్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ డ్యుయల్ రోల్ లో నటించాడు. సినిమాలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా అప్పట్లో మంచి ఫలితాన్ని ఇచ్చింది. మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో పాటుగా సినిమాలో కామెడీ కూడా బాగుంటుంది.
ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ న్యూస్ బయటకు వచ్చింది. వినాయక్ ఈ సినిమాను ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వినిపించారట. పవన్ కథ బాగుందని చెప్పినా తనకు సూట్ అవదని రాం చరణ్ కు రిఫర్ చేశాడట. రాం చరణ్ కు కథ నచ్చడంతో సినిమా తెరకెక్కింది. రాం చరణ్ కు మాస్ ఇమేజ్ తీసుకురావడంలో ఈ సినిమా హెల్ప్ అయ్యింది. అదే నాయక్ సినిమా పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఎలా ఉండేదో అని మెగా ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు.