చిరంజీవికి 15 సార్లు సారీ చెప్పా..!

మెగాస్టార్ చిరంజీవికి తాను 15 సార్లు పబ్లిక్ గా సారీ చెప్పానని అన్నారు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఆర్జీవి లేటెస్ట్ గా పవర్ స్టార్ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచాడు. పవన్ కళ్యాణ్ టార్గెట్ తో వస్తున్న ఈ పవర్ స్టార్ సినిమా ఈ నెల 25న ఆర్జీవి వరల్డ్ ఏఇటిట్ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన ఆర్జీవి ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఛానెల్స్ కు ఇంటర్వ్యూస్ ఇస్తున్న ఆర్జీవి ఈ ప్రమోషన్స్ లో తన కామెంట్స్ తో అందరికి షాక్ ఇచ్చాడు. 

పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని చాలాసార్లు చెప్పానని అంటున్న ఆర్జీవి ఆయన మీద అభిమానంతోనే ఈ సినిమా తీశానని అంటున్నాడు. అంతేకాదు చిరంజీవితో తన సినిమా ఆగిపోవడానికి కారణం తనే అని ఒప్పుకున్నాడు. ఆ విషయం గురించి చిరంజీవికి తాను 15 సార్లు పబ్లిక్ గా సారీ కూడా చెప్పానని అన్నాడు ఆర్జీవి. పవర్ స్టార్ త్ర్వాత థ్రిల్లర్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు వర్మ. ఈ సినిమాను కూడా త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కరోనా వల్ల అందరు సినిమాలు తీయలేక ఖాళీగా ఉంటుంటే ఆర్జీవి మాత్రం వరుస సినిమాలు చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు.