9 ప్రేమకథలతో సుకుమార్..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ప్లాన్ చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ లేకపోయుంటే ఈపాటికి సెట్స్ మీద ఉండాల్సిన ఈ సినిమా కొన్నాళ్లు వాయిదా పడ్డది. ఇక ఈ గ్యాప్ లో డైరక్టర్స్ అంతా వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెడుతున్నారు. సుక్కు కూడా తన దగ్గర ఉన్న కథలతో వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట. అందరిలా చేస్తే ఆయన సుకుమార్ ఎందుకు అవుతాడు చెప్పండి. అందుకే 9 ప్రేమకథలతో 9 పార్టులుగా ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నాడట. 

సుకుమార్ డైరెక్ట్ చేస్తాడా.. లేక సుకుమార్ నిర్మించి ఈ వెబ్ సీరీస్ లను తీస్తాడో తెలియాల్సి ఉంది. సుకుమార్ డైరెక్ట్ చేసినా చేయకపోయినా ఆయన సమక్షంలో లవ్ స్టోరీ అంటే తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి సుకుమార్ చేయబోతున్న ఈ 9 లవ్ స్టోరీస్ వెబ్ సీరీస్ ఎలా ఉంటుందో చూడాలి.