
సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే వాణిజ్య ప్రకటనల్లో కూడా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే 35 బ్రాండులను ప్రమోట్ చేస్తూ సౌత్ లో హయ్యెస్ట్ పెయిడ్ సెలబ్రిటీ గా క్రేజ్ తెచ్చుకున్న మహేష్ ఇప్పుడు మరో ప్రొడక్ట్ ను ప్రమోట్ చేస్తున్నాడు. రిలయన్స్ జియో టివికి సౌత్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ చేయబోతున్నాడని తెలుస్తుంది. జియో టివి ప్లస్ కు మహేష్ ప్రమోట్ చేయబోతున్నాడు. ఒక్కో ఓటిటికి ఒక్కో లాగ్ ఇన్ ఐడి, పాస్ వర్డ్, ఇంకా మంత్లీ, ఇయర్లీ సబ్ స్క్రైబింగ్ ఇదంతా లేకుండా జియో టివితో ఒక్క లాగ్ ఇన్ తో అన్ని ఓటిటిలు ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో అందరు తమ సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని చూసుకుంటున్నారు. అందుకే జియో టివి అన్నివ్హ్దాలుగా ఉపయోగపడుతుందని అంటున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ జియో టివి ప్రమోట్ చేస్తుండగా సౌత్ లో మహేష్ ఆ ఛాన్స్ అందుకున్నాడు. సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటనల్లో కూడా మహేష్ తన సత్తా చాటుతున్నాడని చెప్పొచ్చు.