మహేష్ రిజెక్ట్ చేసిన కథతో ఎన్.టి.ఆర్..!

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ తన నెక్స్ట్ సినిమా పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు.

కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ మహేష్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. మహేష్ ను కలిసి ఓ లైన్ కూడా చెప్పాడట. కాకపోతే మహేష్ కు ఎందుకో ఆ స్టోరీ లైన్ నచ్చలేదట. అయితే అదే కథను ఎన్.టి.ఆర్ కు చెప్పి ఒప్పించాడు ప్రశాంత్ నీల్. మహేష్ ఎందుకు కాదన్నాడో తారక్ ఏం చూసి ఓకే చెప్పాడో కాని మహేష్ రిజెక్ట్ చేసిన కథతో ఎన్.టి.ఆర్ సినిమా అంటూ గట్టిగానే ప్రచారం జరుగుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా సినిమా షురూ కానుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేసే సినిమా ఇదే అని అంటునారు. ఓ పక్క త్రివిక్రం కూడా తారక్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాతనే త్రివిక్రం సినిమా ఉంటుందని టాక్.